ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి: భిక్షపతి గౌడ్

– పూజార్ల సంఘం అధ్యక్షుడు జగ్గారావు, తుడుందెబ్బ నాయకులతో కలిసి కరపత్రం ఆవిష్కరణ
– ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ముంజాల బిక్షపతి గౌడ్
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ లతో కలిసి వారి చేతుల మీదుగా, ములుగు జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుంజాల బిక్షపతి వనదేవతల సన్నిధిలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క జిల్లా గా నామకరణం చేయాలని, ఈ న్యాయమైన డిమాండ్ అని వారు అన్నారు. కొత్త ప్రభుత్వం గద్వేల్కు జోగులాంబ ని సిరిసిల్లకు వేములవాడ రాజన్న అని, భువనగిరి కి యాదాద్రి అని, కొత్తగూడెంకు భద్రాద్రి అని, భూపాలపల్లికి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ జిల్లా అని, పేర్లు పెట్టారని చెప్పారు. అదే రకంగా ములుగు జిల్లాకు సమ్మక్క సారల ములుగు జిల్లాగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. 23వ తారీకు వనదేవతల దర్శనానికి మేడారం వస్తున్న రేవంత్ రెడ్డి అదేరోజు ములుగు జిల్లాకు సమ్మకసార్లకు నామకరణం చేయాలని కోరారు. 2023లో ఫిబ్రవరి 6న పాదయాత్ర చేసినప్పుడు కూడా మేము అధికారంలోకి వస్తే ములుగు జిల్లాకు సమ్మక-సారలమ్మ నామకరణం చేస్తామని హామీ ఇచ్చారని, వెంటనే అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజార్ల సంఘం అధ్యక్షుడు సిద్ధమైన జగ్గారావు, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు వట్టం జనార్ధన్, ఫోన్ చేసాను రాష్ట్ర నాయకులు నగరవేరి రాష్ట్ర కార్యదర్శి కోరిక ఉదయ్ సింగ్ శీనన్న, నవీన్, వేణు, తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కబ్బాక్ష శ్రావణ్, పొదెం కృష్ణ ప్రసాద్, చంద మహేష్, పొడెం రత్నం తదితరులు పాల్గొన్నారు.
Spread the love