మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన కే సదాశివ చారి అనే వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా శనివారం ఎమ్మెల్యే సీతక్క సదాశివ చారి కుటుంబ సభ్యులన పరామర్శించి ఓదార్చారు. ఇంటికి పెద్ద దిక్కు అయిన సదాశివ చారి మృతి తీరని లోటని అన్నారు. చారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉండి ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, కోరం రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love