కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

నవతెలంగాణ -తాడ్వాయి 
మండల కేంద్రంలోని రైతు వేదిక భవన్ ఆవరణలో ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క స్థానిక తాసిల్దార్ ములుగు శ్రీనివాస్ అధ్యక్షతన, మండలంలోని మిగతా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి గురువారం 61 కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ములుగు ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వాన్నించే ప్రతి ఒక్క రూపాయి చేరాలని దళారులను నమ్మి మోసపోవద్దని, పెళ్లి జరిగిన వెంటనే నేరుగా మీ సేవలో దరఖాస్తు చేసుకొని మండల తాసిల్దార్ కార్యాలయంలో ఇస్తే సరిపోతుందని అన్నారు. 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకు మాత్రమే పెళ్లిళ్లు చేయాలని తెలిపారు. ములుగు జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ  పేదింటి ఆడపడుచులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని అన్నారు. గతంలో ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడేవారని, ఆడబిడ్డల కష్టాలను చూసిన సీఎం కేసీఆర్‌ వారి కష్టాలను దూరం చేసేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. దీంతో ఆడ పిల్లల తల్లిదండ్రుల కష్టాలు తీరాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే తెలంగాణ అగ్రహాన్నిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గొంది వాణిశ్రీ, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్, ఎంపీడీవో సత్యాంజనేయ ప్రసాద్, వైస్ ఎంపీపీ పాక కాంత, సర్పంచులు పుల్లూరి గౌరమ్మ, నాగేశ్వరరావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పులుసం పురుషోత్తం, ఎంపిటిసి జయమ్మ, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love