దశ దిన కర్మకు హాజరైన ములుగు జడ్పీ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి

నవతెలంగాణ -తాడ్వాయి 
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాల్వపల్లి గ్రామానికి చెందిన కొప్పుల దళిత్ ఇటీవలే మరణించిగా దశదినకర్మకు శనివారం ములుగు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ బడే నాగజ్యోతి హాజరై వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనో ధైర్యం కల్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈ కార్యక్రమం లో  మండల అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, ఆత్మ చైర్మన్ రమణయ్య, డైరెక్టర్ పులుసం పురుషోత్తం,  మండల మహిళల అధ్యక్షులు,సర్పంచ్లు  ఉపసర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ సొసైటిల డైరెక్టర్లు, యూవజన విభాగం  అధ్యక్షులు,  గ్రామకమిటి అధ్యక్షులు, నాయకులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు  పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు..
Spread the love