కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ ఛైర్మన్

నవతెలంగాణ – తిరుమలగిరి 

తిరుమలగిరి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైన శాగంటి అనసూయ రాములును బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాతో పార్టీలోకి ఆహ్వానించి, సన్మానించారు. బుధ వారం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నివాసంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి శాసనసభ్యులు, పీసీసీ నాయకులతో జరిగిన సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సారథ్యంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులను కాంగ్రెస్ కండువాతో సన్మానించి, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ శాగంటి అనసూయ రాములు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సహకారంతో తిరుమలగిరి మున్సిపాలిటీనీ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ల తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ జమ్మిలాల్, పట్టణ అధ్యక్షులు పేరాల వీరేష్, జిల్లా నాయకులు సుంకరి జనార్ధన్,  మీడియా ఇన్ఛార్జి కందుకూరు లక్ష్మయ్య, తిరుమణి యాదగిరి, హీరూ నాయక్  తదితరులు పాల్గొన్నారు.
Spread the love