నగరంలో రెండో రోజు మున్సిపల్ కమిషనర్ పర్యటన 

నవతెలంగాణ కంఠేశ్వర్ 
నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మకరంద్ బుధవారం నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటించి తనిఖీలను నిర్వహించారు. అందులో భాగంగా మొదట అర్సపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి వసతి కల్పిస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులను కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత అర్సపల్లి అంగన్వాడి కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ తనిఖీ చేసి అంగన్వాడి కేంద్రానికి సరైన సమయంలో ప్రభుత్వం ద్వారా వచ్చేవి వాటున్నాయ లేదా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే వాటిని అమలు పరుస్తున్నారా లేదా అనేది కూడా విచారించారు. అనంతరం నగరం లోని 5 వ జోన్ పరిధిలో ఆరవ పోలీస్ స్టేషన్ సారంగాపూర్ వద్ద వన మహోత్సవం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ మకరంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love