మంట కలుస్తున్న.. మానవ సంబంధాలు రోజు రోజుకు పెరువుతున్న హత్యలు

నవతెలంగాణ-చందుర్తి:
పేగు బంధాలు కాదు ప్రేమ బంధాలు అనుమానాలు, గొడవలతో ఒకరి పై ఒకరికి నమ్మకాలు పోయి సంబంధాలు తెగిపోతున్నాయి. మద్యానికి బానిసై క్షణిక ఆవేశాల తో హత్యలు చేసుకుంటున్నారు. క్రైమ్‌ రేట్‌ గత పదేళ్ల కిందట చూసుకుంటే చాలా పెరుగురుంది. మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ తన భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. రామారావు పల్లి గ్రామానికి చెందిన గొడవ వల్ల గొడ్డలితో నరికి చంపాడు. జోగాపూర్‌ సంవత్సర వ్యవధి లో మూడు హత్యలు జరిగాయి వట్టిమల్ల కనకయ్య ,గొల్లపెళ్లి లింగవ్వ, గొల్ల పెళ్లి శంకర్‌ భూ వివాదంలో హత్య చేయపడ్డారు.నర్సింగా పూర్‌ గ్రామంలో సంవత్సరం కిందట రుద్రాంగి మండల కేంద్రానికి చెందిన నరవేని గణేష్‌ తన భార్య స్వప్న వేధించడం తో బంధువులు హత్య చేశారు,. వారం కిందట మాల్యాల గ్రామంలో వివాహేతర సంబంధం నేపంతో పడిగేల నరేష్‌ ను కొండూరు మల్లేశం అనే వ్యక్తి హత్య చేశాడు.మరో వైపుగా వేములవాడ పట్టణంలో ఓ లాడ్జ్‌ లో వెంకటమ్మను గుర్తు తెలియని వ్యక్తి హత్య చేసాడు. తిప్పాపూర్‌ లో శ్రీనివాస్‌ చారి అనే వ్యక్తి ని ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన ఇద్దరు వ్యక్తులు హత్య చేయడం జరిగింది. ఇలీ చెబుకుంటూ పోతే చలా సంఘటనలున్నాయి.
భూసమస్య.గొడవలు,
వివాహేతర సంబంధాలు
భూ వివాదాలు వివా హేతర సంబంధాల కార ణంగా పలు హత్యలు జరిగిన ఘటనలు ఉన్నాయి. నర్సింగా పూర్‌.జోగాపూర్‌, రుద్రాంగి లో భూ సమస్య ల తోనే హత్యలు జరిగాయి.మరో వైపుగా మాల్యాల లో వివాహేతర సంబంధాల కారణంగా హత్య జరిగింది.
మానవ సంబంధాలు పెంచుకోవాలి కానీ
తృంచు కోవద్దు డీఎస్పీ నాగేంద్ర చారి
ప్రజలు మానవత సంబంధాలు పెంచుకోవాలి కానీ తృంచుకునే పని చేసుకోవద్దని సూచించారు. భూ సమస్యలు ఉంటే సామరస్యంగా చేసుకోవాలి గొడవలకు పోయి హత్యలు చేసుకోవద్దు.తాగుడు కు బానిసై వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబం లో విభేదాలు వచ్చి హత్యలు చేసుకుంటున్నారు.

Spread the love