నా ఫ్రెండ్‌దేమో పెళ్ళి..

గత రెండేళ్ళలో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ భాషల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్‌ వీడియో సాంగ్స్‌ను అందించింది. వీటిలో ‘జరీ జరీ పంచెకట్టి, గుంగులు, సిలక ముక్కుదానా, జంజీరే, వద్దన్నా గుండెల్లో సేరి’ వంటి పాటలు మంచి రెస్పాన్స్‌ని రాబట్టుకున్నాయి. లేటెస్ట్‌గా ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అనే పాటను నటుడు జేడీ చక్రవర్తి రిలీజ్‌ చేశారు. నివృతి వైబ్స్‌ నుంచి మరో తెలంగాణ జానపద పాట మ్యూజిక్‌ వీడియోగా మన ముందుకు వచ్చింది. ఈ పాటలో జయతి ప్రధాన భూమికను పోషించి, అద్భుతమైన హావ భావాలతో, మూమెంట్స్‌లో కట్టి పడేసింది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ భీమ్స్‌ సిసిరోలియో ఈ సాంగ్‌కు సంగీత సారథ్యాన్ని వహించారు. శ్రావణ భార్గవి అద్భుతంగా పాడి ఈ పాటకు ప్రాణం పోశారు. భాను మాస్టర్‌ సాంగ్‌కి చక్కని కొరియోగ్రఫీ చేశారు. లిరిసిస్ట్‌ కాసర్ల శ్యామ్‌ మరోసారి తన పెన్‌ పవర్‌ ఎలా ఉంటుందో చూపించారు. జయతి విజన్స్‌ సమర్పణలో శ్రీకోనేటి ఈ పాటను డైరెక్ట్‌ చేశారు. 2024 పూర్తయ్యేసరికి దాదాపు 150కి పైగా మ్యూజిక్‌ వీడియో సాంగ్స్‌ను అందించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు నివృతి వైబ్స్‌ సంస్థ తెలిపింది.

Spread the love