నవతెలంగాణ – హైదరాబాద్: చిన్నప్పటి నుంచి కోహ్లీ ఆటతీరు చూస్తూ పెరిగానని యంగ్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. క్రికెట్లో తనకు కోహ్లీ ఆరాధ్య దైవమని చెప్పారు. విరాట్ స్టైల్ చూసి బ్యాటింగ్ నేర్చుకున్నానని.. అతడి గేమ్ ప్లే, ఆటిట్యూడ్ అంటే తనకెంతో ఇష్టమని అన్నారు. ఇండియన్ క్రికెట్ స్టైల్‌ను కింగ్ మార్చేశారని, అతడిలో ప్రతి క్వాలిటీని అభిమానిస్తానని నితీశ్ వివరించారు.