– భూమి మీద ప్రజలు ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుంది..
– సీపీఐ(ఎం) మహాసభలో ఎమ్మెల్సీ, ప్రజా కవి గోరటి వెంకన్న..
నవతెలంగాణ – అచ్చంపేట
విద్యార్థి దశలోనే భారత విద్యార్థి ఫెడరేషన్ తోనే నా ప్రయాణం ప్రారంభం అయిందని, కమ్యూనిస్టులు అంటే అభిమానంతోనే ఈరోజు సమావేశానికి రావడం జరిగిందని, భూమి మీద ప్రజలు ఉన్నంతవరకు ఎర్రజెండా ఉంటుందని ఎమ్మెల్సీ ప్రజాకవి గోరేటి వెంకన్న అన్నారు. శనివారం అచ్చంపేటలో సీపీఐ(ఎం) మూడవ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా గోరటి వెంకన్న పాల్గొని మాట్లాడారు. కాలంలో అనేక మర్పుల కారణంగా నేను కూడా కొన్ని రాజకీయ పార్టీలకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధానంగా పేదలకు వైద్యం , విద్య కోసం ఉన్న కాస్త స్థిరాస్తులను అమ్ముకుంటున్నారని చిన్న ఆరోగ్య సమస్యకు లక్షల్లో ఖర్చు అవుతున్న పరిస్థితి ఉందన్నారు. దేశంలో రాష్ట్రంలో, ప్రధానంగా ఉచితంగా విద్య వైద్యం పేదలకు అందించే విధంగా ప్రత్యేక చట్టాలు తీసుకురావడం కోసం కమ్యూనిస్టులు పార్టీలు ఉద్యమించవలసిన సమయం వచ్చిందన్నారు. కమ్యూనిజం అంటేనే నిజం పేద ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేసి ఊరు ఊరు విస్తరించి నల్లమలలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. ఈ ప్రాంతంలో రహీం ,అంతయ్య లు ప్రజల కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని కొనియాడారు. కమ్యూనిజం పైన పాట పాడుతూ ప్రజలను మెప్పించారు. భవిష్యత్తులో ప్రజలకు పేదలకు కచ్చితంగా ఎర్రజెండా అండగా ఉండాలని సూచించారు.