నవతెలంగాణ-హైదరాబాద్ : తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి తనకు ప్రాణ హాని ఉందని నటుడు మోహన్ బాబు పోలీసులకు తెలిపారు. హైదరాబాద్ లోని నివాసంలో పోలీసులు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. మనోజ్‌పై దాడి గురించి ప్రశ్నిస్తున్నారు. ఆదివారం జరిగిన దాడి ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని మోహన్ బాబును పోలీసులు కోరారు.