మెప్పించే నా..నీ ప్రేమకథ

My pleasing..your love storyఅముద శ్రీనివాస్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నా.. నీ ప్రేమ కథ’. కారుణ్య చౌదరి కథానాయిక. పోత్నాక్‌ శ్రవణ్‌ కుమార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై పోత్నాక్‌ శ్రవణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్‌ 2న ఈ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ప్రీ రిలీజ్‌ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో చిత్ర బందంతో పాటు టీఎఫ్పీసీ సెక్రటరి ప్రసన్న కుమార్‌, రామకష్ణ గౌడ్‌, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అముద శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ‘వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. నటుడిగా, దర్శకుడిగా పని చేయడం ఒక సవాల్‌. మా డీవోపీతో పాటు చిత్ర బందం అంతా ఎంతో సహకరించింది. నిర్మాత శ్రవణ్‌ కుమార్‌ ఎక్కడా రాజీపడకుండా సినిమాకి కావాల్సింది సమకూర్చారు. ఇందులో హీరో పాత్ర పేపర్‌ బారు, హీరోయిన్‌ డాక్టర్‌. వారి మధ్య ప్రేమ ఎలా పుట్టింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమ ఎలా అయినా పుట్టొచ్చు అనేది ఇందులో చిత్రీకరించాం. యూత్‌, ఫ్యామిలీ అందరూ చూడాల్సిన మూవీ ఇది’ అని తెలిపారు. ‘తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపాం. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని నిర్మాత పోత్నాక్‌ శ్రవణ్‌ కుమార్‌ అన్నారు.

Spread the love