నవతెలంగాణ- నవీపేట్: నిరుపేదలకు సేవ చేయడమే తన ధ్యేయమని తూము శివమ్మ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తూము శరత్ రెడ్డి అన్నారు. మండలంలోని నాగేపూర్ గ్రామంలో నిరుపేదలకు నిత్యవసర సరుకులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మగారైన శివమ్మ ట్రస్ట్ పేరుతో నిరుపేద కుటుంబాలను గుర్తించి నిత్యవసర సరుకులు, ఆర్థిక సహకారం, అంత్యక్రియల కొరకు సైతం తనవంతుగా సహకారం అందిస్తున్నానని భవిష్యత్తులో మరింత సహకారం అందించేందుకు ముందుంటానని అన్నారు. బోధన్ లో గత కొంతకాలంగా 5రూపాయలకే భోజనం అందిస్తూ విజయవంతంగా కొనసాగిస్తున్నామని భగవంతుడి కృపతో మరింత ప్రజాసేవ చేసే అవకాశం లభించాలని బోధన్ మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ స్వరూప మహిపాల్, బోధన్ కౌన్సిలర్లు శ్రీకాంత్ గౌడ్, మీర్ వాజిద్ అలీ, సత్యనారాయణ పిట్ల మరియు ఇంద్రకరణ్ తదితరులు పాల్గొన్నారు.