నా నల్లా కలువా పువ్వా..

నా నల్లా కలువా పువ్వా..చైతన్య రావు, అర్జున్‌ అంబటి హీరోలుగా, కిశోరి ధాత్రక్‌ హీరోయిన్‌గా రవిశంకర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తెప్ప సముద్రం’. సతీష్‌ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్‌ గౌడ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి పి.ఆర్‌ సంగీత దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ఈ సినిమా ఏప్రిల్‌ 12న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ చిత్రం నుండి పెంచల్‌ దాస్‌ రాసి, పాడిన ‘నా నల్లా కలువా పువ్వా’ సాంగ్‌ ఎంఆర్‌టీ మ్యూజిక్‌ ద్వారా విడుదల చేసారు. కొంతమంది మగాల చేతిలో అమ్మాయిలు ఎలా బలైపోతున్నారో, వారికోసం కుటుంబం పడుతున్న బాధలు, రోదనలు ఈపాటలో మనసుని కదిలించేలా చూపించారు. సాంగ్‌ ఆద్యంతం చాలా ఎమోషనల్‌గా సాగింది.
నిర్మాత రాఘవేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ, ‘దర్శకుడు సతీష్‌ చెప్పిన కథ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా అవుట్‌ ఫుట్‌ చూసాను. చాలా బాగా వచ్చింది’ అని తెలిపారు. ‘మా నిర్మాత రాఘవేందర్‌ ఎక్కడా కంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రేక్షకులు నచ్చే మంచి కమర్షియల్‌ చిత్రం అవుతుంది’ అని దర్శకుడు సతీష్‌ రాపోలు చెప్పారు.

Spread the love