మొరం తేచ్చి నా తంట..

– ఇరు గ్రామాల మధ్య ఘర్షణ..
నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని అమృతాపూర్ గ్రామస్థులు, ఒడ్డెర కాలనీ వాసులు ఆదివారం ఎర్రకుంటలో మొరం తవ్వకాల విషయంలో ఘర్షణకు దిగారు. ఇరు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఎర్రకుంటకు తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నేలకోన్నయి. అమృతాపూర్ వాసులు ఊళ్లో అవసరాల నిమిత్తం మొరం తవ్వకాలు చేపట్టగా ఒడ్డెర కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామాల మధ్య నెలకొన్న వాగ్వాదం తివ్ర ఘర్షణకు దారి తీసింది. ఈ విషయం దహనంల తెలియడంతో డిచ్ పల్లి ఎస్ ఐ కచ్చకాయల గణేష్ తన పోలీసులు సిబ్బంది తో ఘటన స్థలానికి చేరుకుని ఇరు గ్రామాల ప్రజలను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు ఎంతకూ వినిపించుకోలేదు. అయితే మట్టి, మొరం తవ్వకాల్లో తమకు వాటా ఇస్తామని అమృతాపూర్ గ్రామస్థులు గతంలో మాట ఇచ్చి, ఇప్పుడు వాటా ఇవ్వడం లేదని ఒడ్డెరకాలనీ వాసులు వాపోయారు. మొరంను తమ ఊళ్లో ఇళ్ల నిర్మాణ అవసరాల కోసమే తీసుకెళ్తున్నాం తప్ప విక్రయించడానికి కాదంటూ అమృతాపూర్ గ్రామస్ధులు వాదించారు. సుమారు రెండున్నర గంటల పాటు ఇరు గ్రామాల జనం వాదనలకు దిగారు. అమృతాపూర్ గ్రామస్థులు ఎంపీటీసీ సాయిలుకు వ్యతిరేకంగా, ఒడ్డెర కాలనీ వాసులు సర్పంచి భర్త నర్సింగ్ రావుకు వ్యతిరేకంగా పేద్ద ఎత్తున ఒకరికి ఒకరు నినాదాలు చేసుకున్నారు. ఎట్టకేళకు పోలీసులు నచ్చజెప్పడంతో ఇరు వర్గాల ప్రజలు శాంతించారు. అమృతాపూర్ గ్రామస్థులు, ఒడ్డెరకాలనీ వాసులు ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను కలిసేందుకు వేర్వేరుగా ట్రాక్టర్లలో పేద్ద సంఖ్యలో తరలివెళ్లారు. ఘర్షణలకు పోకుండా సామరస్యంగా సమస్య పరిష్కరించుకుని కలిసి మెలిసి ఉండాలని ఎమ్మెల్యే ఇరు గ్రామాల ప్రజలకు సూచించినట్లు సమాచారం.

Spread the love