నా మట్టి నా దేశం ఆజాద్ కా అమృత మహోత్సవం

నవతెలంగాణ-గోవిందరావుపేట

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో  మండల కేంద్రంలో భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న నా మట్టి నా దేశం  ఆజాద్ కా అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఆదివారం మండలంలోని ప్రతి గ్రామం నుండి మట్టిని సేకరించి దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృతం వాటిక నిర్మాణానికి మట్టి సేకరణ కార్యక్రమం మండల అధ్యక్షులు మద్దినేని తేజ రాజు ఆధ్వర్యంలో సేకరించడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు అసెంబ్లీ కన్వీనర్ బలరాం  హాజరై మాట్లాడారు. భారతదేశంలోని ప్రతి గ్రామము నుండి మట్టిని సేకరించి ఢిల్లీలో అమృత వాటిక నిర్మాణానికి మట్టి సేకరణకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేయడం జరుగుతుంది అని అన్నారు. పార్టీ కార్యకర్తలు నాయకులు ఎంతో పవిత్రతతో ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగు రవీందర్ రెడ్డి కర్ర సాంబశివారెడ్డి మెరుగు సత్యనారాయణ బొమ్మరబోయిన  వీర బిక్షం రామచంద్రు కొత్త సుధాకర్ రెడ్డి ఎద్దునూరి రమేష్ ఏదునూరి రమేష్ చంద జ్యోతి దావుల స్వప్న వద్దులవీరేందర్ అనిల్ వలుపదాసు  రవిశంకర్ బైరి మహిపాల్ రెడ్డి అందాల రవీందర్ రెడ్డి వాసంపల్లి వెంకటరెడ్డి బాల్యం రవి శ్యామల అక్కయ్య చౌదరి శివాజీ మద్దినేని శ్రీనివాస్ బడేటి సమ్మయ్య పాక సమ్మయ్య తోడి శీను అజ్మీర లలిత గుగ్గిళ్ళ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love