నా ఓటు నా హక్కు..

– గోడ రాతలతో ఓటు పై అవగాహణ..
– పోలింగ్ కేంద్రాల గోడలు పై ఓటు నినాదాలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
నినాదం ఏదైనా,ఎలా ప్రకటించినా ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తుంది.అందుకే ఎన్నికల కమీషన్ రాజకీయ పార్టీలు గోడలు పై రాసే రాతలను నిషేధించింది. అయితే ఎన్నికల సంఘం ఓటు నమోదు శాతం పెంపొందించేందుకు అనేక రకాల ప్రచార పద్ధతులను చేపడుతుంది. ఇందులో భాగంగా పోలింగ్ కేంద్రాల గోడలు పై ఓటు పై అవగాహన కల్పించాలని సంకల్పించింది. సోమవారం పలు పోలింగ్ కేంద్రాల గోడలు పై రాతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఓటు నమోదు శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం అనేక సంస్కరణలు చేపట్టింది అని అందులో భాగంగా ఎంపిక చేయబడిన పోలింగ్ కేంద్రాల గోడలు పై ఓటు ప్రత్యేకత, ప్రాధాన్యం, ప్రజాస్వామ్య పరిరక్షణ పరమావధిగా నినాదాలు గోడలు పై రాయిస్తున్నామని అన్నారు.

Spread the love