విజయ్ ‘లియో’ నుంచి నా రెడీ లిరికల్‌ వీడియో సాంగ్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : దళపతి విజయ్ ప్రస్తుతం లియోతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా లోకేశ్‌ కనగరాజ్‌  దర్శకత్వంలో వస్తోంది. మేకర్స్ నేడు విజయ్‌ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన లియో ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట హల్‌ చల్ చేస్తోంది.. విజయ్‌ సుత్తె పట్టుకొని యాక్షన్‌ మూడ్‌లో స్టిల్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కాగా ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్‌ సాంగ్‌ నా రెడీ సాంగ్‌ ప్రోమోను విడుదల చేయగా.. నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం విజయ్‌ బర్త్ డే గిఫ్ట్‌గా ‘నా రెడీ’ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను లాంఛ్ చేశారు. విష్ణు ఎడవన్ రాసిన ఈ ట్రాక్‌ను దళపతి విజయ్‌, అనిరుధ్‌ రవిచందర్ కలిసి పాడటం విశేషం. లియో ప్రాజెక్టులో త్రిష ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్‌, యాక్షన్‌ కింగ్ అర్జున్‌, ప్రియా ఆనంద్‌, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్‌, గౌతమ్ వాసు దేవ్‌మీనన్‌, మిస్కిన్‌, మాథ్యూ థామస్‌, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న లియో అక్టోబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Spread the love