నాడు ‘జన’ జాతర.. నేడు ‘జల’ జాతర…

– జలదిగ్బంధనంలో మేడారం
– లక్షల రూపాయల నష్టపోయిన వ్యాపారులు   
నవతెలంగాణ-తాడ్వాయి 
కోటి మంది భక్తులకు కొంగు బంగారం అయిన మేడారం జాతర సమయంలో జన జాతరగా ఉంటే నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జల జాతరగా మారింది.భారీ వర్షాల నేపథ్యంలో  గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మేడారం జాతర ప్రాంగణం జరదిగ్బంధంలో చిక్కుకుంది  మేడారం జంపన్న వాగు ఉదృతి కొనసాగుతుంది. వరద మేడారం గద్దెల ప్రాంతానికి చేరుకుంది దీంతోమేడారం రెడ్డిగూడెం పోరాటం కన్నెపల్లి పరిసర ప్రాంతాలు వర్షం నీటితో ముంపున గురయ్యాయి. సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రాంతంలో ప్రజలు ఏర్పాటు చేసుకున్న వ్యాపార సముదాయాలు మొత్తం నీట మునిగి వేలాది రూపాయల నష్టాన్ని మిగిల్చాయని వ్యాపారులు వాపోతున్నారు అంతేకాకుండా మేడారం ఐటీడీఏ క్యాంప్ ఆఫీస్ మరియు మీడియా పాయింట్ ఏరియాలో కూడా భారీ స్థాయిలో నీరు చేరి సముద్రాన్ని తలపిస్తున్నాయి. కాగా మేడారం లో ఉన్న వ్యాపారులు ప్రజలు నార్లాపూర్ లేదా వరంగల్ మార్గంలో రావడానికి జంపన్న వాగు అడ్డు రావడంతో ఇబ్బంది పడుతున్నారు.
Spread the love