నవతెలంగాణ – ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాలనలో ఏపీలో జరిగిన అభివృద్ధి శూన్యమేనని జనసేన సీనియర్ నేత నాగబాబు విమర్శించారు. వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ఎన్నికల ప్రచార సభలలో తమ పార్టీ అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ.. ఆర్థికంగా అంతంత మాత్రమే అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియోలను నాగబాబు కూడా రీట్వీట్ చేశారు. ఈమేరకు జగన్ ప్రచార వీడియోలను ట్వీట్ చేస్తూ నాగబాబు ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలను అనుకరిస్తూ.. జగన్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి అంతంత మాత్రమే కాదు అసలు ఏమీ జరగనేలేదని ఏపీ ముఖ్యమంత్రిపై సెటైర్ వేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ పేరు పలకడానికి కూడా జగన్ జడుస్తాడని నాగబాబు ఎద్దేవా చేశారు.