యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా ‘నాగరపు’ నియామకం

 నవతెలంగాణ-గంగాధర : గంగాధర మండలం గోపాల్ రావుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ నాగారపుసత్యనారాయణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా నియామకం చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు బొద్దుల బాబురావు యాదవ్ నియామకపు ఉత్తర్వులు అందించారు. కొద్ది సంవత్సరాలుగా యాదవ మహాసభలో చురుకైన నాయకుడిగా వ్యవహరిస్తుండడంతో జిల్లా బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర నాయకులు నిర్ణయం తీసుకున్నారు. గోపాల్ రావు పల్లి గ్రామ సర్పంచ్ గా పలు టర్ములు ఎన్నిక కాగా, యాదవ కులస్తుల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తన నియామకానికి కృషి చేసిన యాదవ సంఘం జిల్లా, నాయకులకు రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ యాదవుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

Spread the love