తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి విరాళం ప్రకటించిన నాగార్జున

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు కుదిపేయడం పట్ల అక్కినేని ఫ్యామిలీ స్పందించింది. రూ.1 కోటి రూపాయలు విరాళం ప్రకటించింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున అందిస్తున్నట్టు అక్కినేని నాగార్జున వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను వేగంగా చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు మనమంతా సంఘటితంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సవాలును నిబ్బరంగా ఎదుర్కొందామని, బలంగా నిలుద్దామని నాగార్జున పిలుపునిచ్చారు.

Spread the love