నవతెలంగాణ -పెద్దవూర: కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ అభ్యర్థి కుందూరు జయవిర్ రెడ్డి గెలవాలని కొత్తలూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం కొత్తలూరు నుంచి పెద్దవూర మండలం మండలం లింగంపల్లి పెద్దమ్మ తల్లి దేవాలయం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జయవిర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా తామంత కృషి చేస్తున్నామని చెప్పారు. జయవిర్ రెడ్డి గెలుపుకు పెద్దమ్మ తల్లీ ఆశీస్సులు అందాలని ఈ పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్రకు లింగం పల్లిలో మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, కొత్తలూరు సర్పంచ్ నులక రమణారెడ్డి, కార్తీక్ రెడ్డి, కొట్టె రమేష్ స్వాగతం పలికారు.