నవతెలంగాణ-హైదరాబాద్ : నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి ‘రంగబలి’ సినిమాను రూపొందించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో కథానాయికగా యుక్తి తరేజా అలరించనుంది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. పవన్ సీహెచ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, జులై 7వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. యాక్షన్ సీన్స్ పై ట్రైలర్ ను కట్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆసక్తిని పెంచుతోంది. గోపరాజు రమణ .. బ్రహ్మాజీ .. సప్తగిరి .. సత్య కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ‘మన ఊళ్లో మనల్ని ఎవడ్రా ఆపేది’ అంటూ మాస్ యాక్షన్ లోకి హీరో దిగిపోవడం ట్రైలర్ కి హైలైట్. ఈ సినిమాలో విలన్ గా షైన్ టామ్ చాకో కనిపిస్తున్నాడు. ‘దసరా’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో ఉన్న నాగశౌర్యకి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి.