19న ఉక్కు వంతెన ప్రారంభం… ఫ్లైఓవర్‌కు నాయిని నర్సింహారెడ్డి పేరు..

ఉక్కు వంతెన
ఉక్కు వంతెన

నవతెలంగాణ హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ భవన్‌ సమీపంలోని వీఎస్టీ కూడలి వరకు నిర్మించిన ఉక్కు వంతెనను ఈ నెల 19న ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ఈ వంతెనకు కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. నాయిని.. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారని.. అలాగే, చాలా కాలం పాటు వీఎస్‌టీ కార్మికుల సంఘానికి సారథ్యం వహించారని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు. రూ.450 కోట్ల వ్యయంతో 2.63 కి.మీల పొడవైన ఈ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ నిర్మించిందని తెలిపారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్‌ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

Spread the love