మేడ్చల్ డీసీసీగా నక్క ప్రభాకర్ గౌడ్ ?

– నందికంటి శ్రీధర్ రాజీనామాతో తెరపైకి బీసీ నేతగా జిల్లాలో మంచి పేరు
నవతెలంగాణ- బోడుప్పల్:  మేడ్చల్ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఇప్పుడా అ పదవీని ఇటీవలి కాలంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత నక్క ప్రభాకర్ గౌడ్ తో భర్తీ చేస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరికను వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న నందికంటి శ్రీధర్ రాజీనామా చేయడంతో ఖాళీ అయిన డీసీసీ పదవిని సీనియర్ నేతైన నక్క ప్రభాకర్ గౌడ్ తో భర్త చేయడం ద్వారా బీసీలకు సముచిత స్థానం కల్పించడంతో పాటు, జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న నక్క ప్రభాకర్ గౌడ్ కు పార్టీలో ప్రధాన్యత కల్పించినట్లవుతుందనే భావన అధిష్టానం దృష్టిలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

Spread the love