నల్గొండ – ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా రాకేశ్ రెడ్డి

నవతెలంగాణ-హైదరాబాద్ : నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరును ప్రకటించారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఆయన పేరును శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 2023 న‌వంబ‌ర్ 4న బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌మక్షంలో రాకేశ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్ దాఖలు చేశారు. తీన్మార్ మల్లన్న తనకు ఉన్న రూ.1.50 కోట్ల ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తనను గెలిపిస్తే మూడేళ్లు అవకాశం ఉంటుందని, ఈ మూడేళ్లలో ఎప్పుడైనా తాను ప్రజలకు అనుగుణంగా పని చేయలేదని భావిస్తే తాను ప్రజా రెఫరెండానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. తనను గెలిపించాలని ఆయన కోరారు.

Spread the love