నలిమెల భాస్కర్‌కు ‘కాళోజీ’ పురస్కారం..

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రతిష్ఠాత్మక కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం నలిమెల భాస్కర్‌‌ను వరించింది. రాజన్న సిరిసిల్ల(D) ఎల్లారెడ్డిపేట(M) నారాయణ‌పూర్‌లో జన్మించిన నలిమెల సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడిగా పేరు తెచ్చుకున్నారు. మొత్తం 14 భాషల్లో ఆయనకు పట్టుంది. తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాక భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు. 2013 కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.

Spread the love