నవ తెలంగాణ కంటేశ్వర్ : నిజామాబాదు నగరంలోని వివేకానంద నగర్ కాలనీ 47వ తర్పా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా నంద్యాల శంకర్ ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో శంకర్ ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకట్ నర్సయ్య శంకర్ కు నియామక పత్రం అందజేశారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దీకొండ యాదగిరి,పుల్గం హన్మాండ్లు,మహిళా సంఘం రాష్ట్ర అద్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి,జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కోశాధికారి సిలివేరి గణేష్,పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు రాపెల్లి గురుచరణ్,నగర పద్మశాలి సంఘం సంయుక్త కార్యదర్శి బింగి మోహన్ పాల్గొన్నారు.