నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101 వ జన్మ దినోత్సవ వేడుకలు, కమ్మ సంఘం కమ్యూనిటీ హాల్ లో మంగళవారం తెలుగుదేశం పార్టీ మరియు అన్న ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. యానాల అనంతరెడ్డి నాయకత్వంలో జంపాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి భారీగా పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కట్ చేసి వందలాది అభిమానుల మధ్య పంచుకున్నారు. వల్లభ నే నీ శ్రీను ,నర్రా శివాజీ ,వెంకట్రామయ్య మరియు అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన అన్న ఎన్టీఆర్ జన్మ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన కమ్మ. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగ వరపు ప్రసాద్ రావు ,కొండపల్లి రాంచందర్ రావు ,నర్సంపేట అభిమానులు ,నర్సింగరావు ,సూర్య ప్రకాష్ ,ఏటూరు నాగారం,మంగ పేట అభిమానులు ,లాలయ్య ,కొడవలి రఘు ,మరియు గోవిందరావు పేట కమ్మ సంఘం అధ్యక్షుడు పాలడుగు ఉమా మహేశ్వరరావు,వివిధ రాజకీయ పార్టీల లో వున్న అభిమానులు,మహిళా.వీరాభి మాని కొమ్మరా జు ఉమ తదితరులను శాలువాలతో సన్మానించారు. అనంతరం సుమారు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.