తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు,తెలుగు ప్రజల ఆత్మీయ అన్నగారు, మాజి ముఖ్య మంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 29 వ వర్ధంతి సందర్భంగా శనివారం కస్తాల క్రాస్ రోడ్ లో పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరామారావు పార్టీ స్థాపించిన 9 నెలలోనే దేశ రాజకీయ చరిత్ర లో పెనుసంచలనం సృష్టించారన్నారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఎన్టీఆర్ దే నున్నారు .పెద ప్రజల కనీస అవసరాలు అయిన కూడు, గూడు, గుడ్డ,వీటిని పేదలకు అందించాలని నిర్ణయించి అమలు చేసిన నేత అని తెలిపారు.తెలుగు ప్రజల అభివృద్ధి కి ఎంతో మేలు చేశాడని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి మోగుదాల పార్వతమ్మ,భువనగిరి పార్లమెంట్ కమిటీ మెంబర్ ఎండి షరీఫ్, మండల నాయకులు అబ్బనబోయిన అంజయ్య యాదవ్, పట్టణ నాయకులు గంట అంజయ్య, సీనియర్ నాయకులు బోడ బిక్షమయ్య, సాపిడి నరసింహ, సింగిరి కొండ అనిల్ , నందగిరి కృష్ణయ్య ,సాయం కనకయ్య, జేమ్స్ ,కా రింగు గిరి తదితరులు పాల్గొన్నారు.