నందికొండ మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి రేపే ముహూర్తం

– రేపు అవిశ్వాస తీర్మానం
– చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలతో అభివృద్ధి శూన్యం
– చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ను గద్దెదించడమే ఏకైక లక్ష్యం
– చైర్మన్ పీఠం ఎవరికి వరించునో
–  నువ్వా, నేనా…అనే రీతిలో కొనసాగుతున్న టెన్షన్
నవతెలంగాణ- నాగార్జునసాగర్
నందికొండ మునిసిపాలిటీ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానాలు ఊపందుకుంటున్నాయి. నందికొండ మునిసిపాలిటీలో ఇప్పటికె రెండు దఫాలుగా అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టాలని కోరుతూ కౌన్సిలర్లు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.నందికొండ మునిసిపల్‌ చైర్పర్సల్ కర్ణ అనూష రెడ్డి, వైస్ చైర్మన్ మంద రఘువీర్ అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. నందికొండ మునిసిపాలిటీలో మొత్తం 11 మంది కౌన్సిలర్లు ఉండగా, బీఆర్‌ఎ్‌సకు 7మంది ఉన్నారు. అందులో 4గురు కాంగ్రెస్ కు చెందిన కౌన్సిలర్లు ఉన్నారు. కౌన్సిలర్లు మొత్తం 11మంది చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టాలని గతంలో రెండు సార్లు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అవిశ్వాసంపై చర్చించేందుకు జనవరి 6వ తేదీ ముహూర్తం ఖరారైంది.
చైర్ పర్సన్  పై అసంతృప్తి
మునిసిపాలిటీల్లో గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌ లో ముసలం కొనసాగుతుంది. బీఆర్‌ఎస్‌ పార్టీలోని అసమ్మతి కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్‌ చైర్ పర్సన్, వైస్‌ చైర్మన్ లను తప్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. నందికొండ చైర్మన్‌పై ఎలాంటి అసమ్మతి లేదని, అంతా సజావుగా ఉందని గత బిఅరెస్ అధిష్ఠానం భావించింది. అయితే బహిరంగంగా  అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కౌన్సిలర్లు చైర్మన్‌ను తప్పించాలని నిర్ణయానికి రావడం చర్చనీయాంశమైంది. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఉన్న నాగార్జున సాగర్ (నందికొండ) నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ కావడం అధికార పార్టీ చైర్మన్ ఉండి మునిసిపాలిటీలోని సమస్యలు పరిష్కారం కావడంలేదని, ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని గతంలో  కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు.నాలుగేళ్ళ చైర్మన్‌ పాలనలో ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తెచ్చింది లేదని వారు ఆరోపించారు. వార్డుల్లో నిధుల సమస్యతో ఎక్కడి పనులు అక్కడే నిలిచాయని, కొత్త పనులు చేపట్టేందుకు గతంలో చైర్మన్‌ శ్రద్ధ తీసుకోలేదని వాపోయారు.
చైర్మన్ పీఠం నుంచి దించడమే ఏకైక లక్ష్యం
చైర్మన్ పీఠం నుండి కర్ణ అనూష రెడ్డి ని దించడమే నందికొండ కౌన్సిలర్ల ఏకైక లక్ష్యంతో పని చేస్తున్నారు. గతంలోనూ చైర్పర్సన్,పాలకవర్గంతో చర్చించకుండా తన సొంత నిర్ణయాలతో ఒంటరి పోకడలకు విసుగెత్తి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొంతమంది కౌన్సిలర్లు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. చైర్మన్ కు పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని అందుకే మూకుమ్మడిగా పాలక పక్షం, ప్రతిపక్ష కౌన్సిలర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
చైర్మన్ పీఠం ఎవరికి వరించునో..
నందికొండలో అవిశ్వాస తీర్మానం అనంతరం చైర్మన్ పీఠం ఎవరికి దక్కనుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నందికొండ చైర్మన్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో నువ్వా నేనా అనే విధంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. నందికొండ మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ అన్నపూర్ణ మరియు మూడవ అవార్డు కౌన్సిలర్ శిరీష మోహన్ నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు.విరిద్దరిలో ఎవరికి అదృష్టం వరించునో.. వేచి చూడాలి అయితే నందికొండలో రెండు కాలనీలు ఉండటం చైర్మన్ పీఠం పైలాన్ కు దక్కితే వైస్ చైర్మన్ హిల్ కాలానికి ఇవ్వాల్సి ఉంటుంది.అదేవిధంగా హిల్ కాలానికి చైర్మన్ పదవి ఇస్తే పైలాన్ కాలనీ కి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. చైర్మన్ ను దించిన అనంతరం చర్చలు జరిపి ఎవరికి ఏ పదవి ఇవ్వాలో చర్చించనున్నట్లు తెలుస్తుంది.ఏడాది మాత్రమే  సమయం ఉండటంతో నందికొండ మున్సిపాలిటీని స్పెషల్ ఆఫీసర్ చేతిలో పెట్టె ఆలోచనలో కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ మున్సిపల్ చట్టం మాత్రం ఇలా ..
తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం విప్ ను ఉల్లంఘిస్తే నష్టం కౌన్సిల్ సభ్యులకే అంటున్న న్యాయస్థానం టి.ఎం యాక్ట్ 2019 సెక్షన్ 37 ప్రకారం జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ అనుమతితో 2024 జనవరి 6న నందికొండ మున్సిపల్ ఛైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇలాంటి సందర్భాల్లో తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 ప్రొవిజన్స్ ద్వారా…గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా ఎన్నికైన సభ్యులకు రూల్ 8 ప్రకారం విప్ జారీ చేసే అవకాశం ఈ చట్టం కల్పించింది. రూల్స్-8 ప్రకారం … విప్ నోటీసులను రాతపూర్వకంగా సభ్యులకు ప్రత్యక్షంగా గాని, కుటుంబ సభ్యులకు గానీ, అందుబాటులో లేనట్లయితే ఇంటికి గాని ప్రదర్శిస్తూ అందజేయడం జరుగుతుంది. చట్టసభలలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు పార్టీ మారినట్లయితే విప్పు వర్తించదు. కానీ స్థానిక సంస్థల సభ్యులకు ఇటువంటి నియమ నిబంధనలు వర్తించవు. మొత్తానికి మొత్తంగా పార్టీ మారినప్పటికిని పార్టీ విప్ అందరికీ వర్తిస్తుంది.విప్ కు అనుగుణంగా చేతులెత్తవలసి ఉంటుంది … లేనట్లయితే వారంలోపే జిల్లా ఎన్నికల అధికారి యైనా కలెక్టర్ వారి సభ్యత్వం పై వేటు వేస్తారు. వారి పదవులను కోల్పోవాల్సి వస్తుంది.15 రోజుల్లో తిరిగి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. బీఅరెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు పార్టీ విప్ ను ఉల్లంఘిస్తే నష్టం వారికే అంటున్న మున్సిపల్ చట్టం & న్యాయస్థానం.

 

నాలుగేండ్లుగా నందికొండ అభివృద్ధి శూన్యం: ఆదాసు నాగరాణి విక్రమ్
నందికొండలో నాలుళ్లుగా అభివృద్ధి శూన్యమని నందికొండ మునిసిపల్‌ 6వ వార్డు కౌన్సిలర్ ఆదాసు నాగరాణి విక్రమ్ ఆరోపించారు. చైర్పర్సన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. నెలనెలా నిర్వహించాల్సిన కౌన్సిల్‌ సమావేశాన్ని మూడు నెలలకు ఒక సారి నిర్వహిస్తున్నారన్నారు. సమావేశాల్లో సైతం ఎజెండాను పక్కన పెట్టి సొంత పనులను చేసుకుంటున్నారని ఆరోపించారు. నందికొండ పట్టణ ప్రజల సమస్యలను పరిష్కరించ లేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Spread the love