యువతకు స్ఫూర్తి నందివాడ గ్రామం..

– ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరంలో 23 యూనిట్ల రక్తదానం
నవతెలంగాణ-తాడ్వాయి :
  మండలంలోని నందివాడ గ్రామంలో ఇండియన్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని గ్రామ సర్పంచ్ స్వాతి వినోద్ గౌడ్ గ్రామ యువత ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో 23 మంది రక్తదానం చేసినట్లు ఐఆర్ సిఎస్ మండల అధ్యక్షులు బొల్లు శ్రీకాంత్ తెలిపారు.ఈ సందర్భంగా బి.ఆర్.ఎస్ మండల నాయడు రాజగౌడ్ మాట్లాడుతూ నందివాడ గ్రామం చిన్నదైనప్పటికీ తమ గ్రామంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని చెప్పగానే యువత ముందుకు వచ్చి 23 యూనిట్ల రక్తదానం చేయడంతో మారుమూల గ్రామాలలో రక్తదానం పై ఉన్న అపోహలను దూరం చేశారని అందులో మొదటిసారి రక్తదానం చేసిన 14 మంది యువకులకు సర్పంచ్ స్వాతి వినోద్ గౌడ్ పంచాయితీ కార్యదర్శి అశోక్ వార్డు సభ్యులు వారిని సన్మానం చేయడం జరిగింది మేము సైతం రక్తదాతలం ఆవుతామంటు ముందుకు వచ్చిన గ్రామ యువకులను రెడ్ క్రాస్ సొసైటీ వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ దత్తు రెడ్డి, స్వామి ,సిహెచ్ రాజయ్య ,సాయిలు ప్రకాష్, ప్రణయ్ కుమార్ లు పాల్గొన్నారు.

Spread the love