– హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్
హైదరాబాద్: 20వ హైదరాబాద్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో నంద్యాల నరసింహారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి సత్తా చాటుతున్నారు. పురుషుల 50 ప్లస్ సింగిల్స్‌లో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ప్రీ క్వార్టర్స్‌లో మహ్మద్ అసిఫ్‌పై అలవోక విజయం సాధించగా.. నరసింహారెడ్డి 8-7(0)తో సాయి గణేశ్‌పై ఉత్కంఠ మ్యాచ్‌లో పైచేయి సాధించాడు. సాంబశివా రెడ్డి 8-3తో శివ ప్రసాద్ రెడ్డి గెలుపొంది క్వార్టర్‌ఫైనల్లో కాలుమోపాడు. లగడపాటి శ్రీధర్ 8-1తో రాజా రామ్ మోహన్‌పై అలవోక విజయం నమోదు చేశాడు. పురుషుల 60 ప్లస్ సింగిల్స్‌లో రామ్ రెడ్డి 8-0తో జవహార్‌పై విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. సికింద్రబాబ్ క్లబ్ వేదికగా దేశవ్యాప్తంగా 220 మంది వెటరన్ క్రీడాకారులు పోటీపడుతున్న ఈ టోర్నమెంట్‌లో ఆదివారం అన్ని విభాగాల్లో ఫైనల్స్ జరుగనున్నాయి.