ఫైనల్లో నంద్యాల నర్సింహారెడ్డి జోడీ

Nandyala Narsimha Reddy pair in the final– ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ
హైదరాబాద్‌ : నంద్యాల నర్సింహారెడ్డి, నీల్‌కాంత్‌ జోడీ మెన్స్‌ డబుల్స్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మెన్స్‌ 50 ప్లస్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో సుధీర్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి జోడీపై నంద్యాల జోడీ 8-6తో విజయం సాధించింది. 50 ప్లస్‌ మెన్స్‌ సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ నీల్‌కాంత్‌పై 8-4తో మెరుపు విజయం సాధించిన లగడపాటి శ్రీధర్‌ సెమీఫైనల్లో చోటు సాధించాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో సుధాకర్‌ రెడ్డిపై 8-2తో ఎంవీఎల్‌ఎన్‌ రాజు ఏకపక్ష విజయం సాధించాడు. మెన్స్‌ 40 ప్లస్‌ డబుల్స్‌ క్వార్టర్స్‌లో కిరణ్‌, అఫ్రోజ్‌ జోడీ 8-5తో యోగేశ్‌, నాగేశ్‌లపై గెలుపొందగా.. సంజరు, వహీద్‌ జోడీ రాంబాబు, కిరణ్‌లపై 8-7(7-4)తో విజయం సాధించారు. 40 ప్లస్‌ సింగిల్స్‌ సెమీస్‌లో మురళీధరన్‌పై 9-6తో నెగ్గిన విజేంద్ర గిరి ఫైన్లలోకి చేరుకున్నాడు. 30 ప్లస్‌ డబుల్స్‌లో కన్నన్‌, విజరు ఆనంద్‌లు 9-3తో ఈశ్వర్‌, వివేక్‌లపై గెలుపొందగా.. నిఖిల్‌, శ్రీరామ్‌ జోడీ 9-7తో గురునాథ్‌, మంజునాథ్‌లపై పైచేయి సాధించారు. 30 ప్లస్‌ సింగిల్స్‌లో విజరు ఆనంద్‌ 8-3తో చక్రధర్‌పై, ఈశ్వర్‌ 8-2తో గురునాథ్‌పై, కన్నన్‌ శెట్టు 8-0తో భరణిలపై గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టారు.

Spread the love