నాని ‘హాయ్‌ నాన్న’ ట్రైలర్‌

నవతెలంగాణ-హైదరాబాద్‌: నాని తండ్రి పాత్రలో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈచిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహించారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా, శ్రుతిహాసన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డిసెంబర్‌ 7న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘హాయ్‌ నాన్న’ ట్రైలర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. విరాజ్‌ – యష్నగా నాని, మృణాల్‌ యాక్టింగ్‌ మనసుని హత్తుకునేలా ఉంది.

Spread the love