ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేశ్

నవతెలంగాణ – హైదరాబాద్: మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్ నిర్వహించినట్లు ఏపీ మినిస్టర్ నారా లోకేశ్ చెప్పారు. శనివారం ఉదయం 8 గంటలకు ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజలను కలిసినట్లు వివరించారు. భారీ మెజారిటీతో తనను గెలిపించి, తనపై మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత బాధ్యత పెట్టారని చెప్పారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారు ఎదుర్కొంటున్న సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరిస్తానని వివరించారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యాచరణ ప్రణాళిక తయారీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. కాగా, నియోజకవర్గంలో ఉన్నపుడు రోజూ ఉదయం 8 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశానని గుర్తుచేశారు.

Spread the love