నవతెలంగాణ – హైదరాబాద్: ఇండియన్ యూత్ గురించి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. నేటి యువకులు ఎంతో తెలివైనవారని, వీరి వయసులో తనకున్న తెలివి కంటే 10-20 రెట్లు ఎక్కువ టాలెంట్ కలిగిఉన్నారని చెప్పారు. యువకులకున్న అడ్డంకులను తొలగించి, ఆకాశానికి చేరుకోవడానికి అవకాశాలను అందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. AI పురోగతిలో భారతదేశం పాశ్చాత్య దేశాలను చేరుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.