నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలో పోసానిపేట గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిలు తల్లి అనారోగ్యంతో ఇబ్బందిపడుతుండటంతో, ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఉండడంతో, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు నా రెడ్డి మోహన్ రెడ్డికి శనివారం సమాచారం అందింది. వెంటనే స్పందించిన నా రెడ్డి స్వచ్ఛంద సంస్థ వారు ఆక్సిజన్ సిలిండర్ను అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.