మహిళల శక్తిని తెలిపే నారీ శక్తి

Nari Shakti refers to the power of womenశ్రీ శ్రీ క్రియేషన్స్‌ శ్రీ పద్మావతి ఫిలిమ్స్‌ పై సతీష్‌ చంద్ర నిర్మాతగా హర్షిత విప్పర్ల, మోహిత్‌ రాథోడ్‌ దర్శకత్వంలో సమ్మెట గాంధీ, గీత, కీర్తి, నీరజ లావణ్య, సౌజన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నారీశక్తి’ షార్ట్‌ ఫిలింకి సంబంధించిన పోస్టర్‌ లాంచ్‌ ఫిలిం ఛాంబర్‌లో చాలా ఘనంగా జరిగింది. నేటి మహిళల్లో ఉండాల్సిన లక్షణాలను తెలియజేస్తూ కొత్త కాన్సెప్ట్‌తో ఈ షార్ట్‌ ఫిలిం మన ముందుకు రాబోతోంది. దర్శకుడు మోహిత్‌ మాట్లాడుతూ, ‘ఆడవాళ్లు అంటే ఓన్లీ ఇంటిపనికే కాదు ఉమెన్‌ ఎంపవర్మెంట్‌ అనేది అందరికీ తెలియాలి అనే కథతో వస్తోంది. ప్రేక్షకులు అందరూ చూసి మమ్మల్ని సపోర్ట్‌ చేస్తారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ‘డైరెక్టర్‌ కథ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇలాంటి కథలు ఎంకరేజ్‌ చేస్తే మంచిది. స్త్రీ శక్తి గురించి చాలా చక్కగా వివరించారు’ అని నిర్మాత సతీష్‌ చంద్ర చెప్పారు. డైరెక్టర్‌ హర్షిత మాట్లాడుతూ, ‘మొదటి నుంచి సమ్మెట గాంధీ చాలా సపోర్ట్‌ చేశారు. చాలా మంచి కొత్త కాన్సెప్ట్‌తో మీ ముందుకు రాబోతున్నాం’ అని అన్నారు.

Spread the love