నాజర్ ఇంట విషాదం

నవతెలంగాణ- హైదరాబాద్: సీనియర్ క్యారెక్టర్ నటుడు నాజర్ ఇంట విషాదం నెలకొంది. నాజర్ తండ్రి మెహబూబ్ బాషా కన్నుమూశారు. 95 ఏళ్ల మెహబూబ్ బాషా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ పరిస్థితి విషమించడంతో తమిళనాడులోని చెంగల్పట్టులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. మెహబూబ్ బాషా మృతి విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. కాగా, పితృవియోగంతో బాధపడుతున్న నాజర్ కు బంధుమిత్రులు, సినీ ప్రముఖులు సానుభూతి తెలుపుతున్నారు. కాగా, మెహబూబ్ బాషా అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు.

Spread the love