పాండ్యాతో విడాకులు..ట్విస్ట్‌ ఇచ్చిన నటాషా

నవతెలంగాణ-హైదరాబాద్ : భార‌త జ‌ట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్‌ దంపతులు విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం వీరి విడాకుల గురించే పెద్ద చర్చ జరుగుతోంది. నటాషా తన ఇన్‌స్టా అకౌంట్ నుంచి తమ వెడ్డింగ్ ఫోటోలను తొలగించడంతోపాటు, తన పేరు పక్కన పాండ్యా అనే సర్ నేమ్‌ను కూడా తొలగించింది. దీంతో విడాకుల రూమర్స్‌ మొదలయ్యాయి. అయితే.. విడాకుల వార్తల‌పై అటు న‌టాషాగానీ, ఇటు పాండ్యాగానీ ఎలాంటి ప్రక‌ట‌నా చేయ‌కపోవడంతో ఈ జంట విడిపోతుందనే పుకార్లకు మరింత బలం చేకూర్చేలా చేసింది. ఈ క్రమంలోనే విడాకుల రూమర్స్‌కు నటాషా తాజాగా ఓ ట్విస్ట్‌ ఇచ్చింది. తమ పెళ్లినాటి ఫొటోలను ఇన్‌స్టాలో తిరిగి రిస్టోర్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది చూసిన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ ‘ఎప్పటికీ ఇద్దరూ కలిసే ఉండండి’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Spread the love