జెల్ల ఐలయ్యకు జాతీయ ఉత్తమ సర్పంచ్ పురస్కారం

– ప్రధానం చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
నవతెలంగాణ – బెజ్జంకి
స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ ఉత్తమ సర్పంచ్ పురస్కారాన్ని మండల పరిధిలోని రేగులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జెల్ల ఐలయ్య అదివారం అందుకున్నారు. హన్మకొండలోని టీఎన్ జీఓ భవన్ యందు శ్రీ శాంతికుమారి,శ్రీ విశ్వకర్మ సేవా ఫౌండేషన్, తెలుగు వెలుగు సాహితి వేదిక,విశ్వకర్మ గాయత్రి నాట్య వేదిక సౌజన్యంతో యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ అద్వర్యంలో ఏర్పాటు చేసిన పురస్కార ప్రధానోత్సవంలో హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జెల్ల ఐలయ్యకు జాతీయ ఉత్తమ పురస్కారం ప్రధానం చేశారు. జాతీయ పురస్కారానికి ఎంపికైన ఐలయ్యను మండలంలో పలువురు సర్పంచులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Spread the love