ఐక్యతా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

నవతెలంగాణ – డిచ్ పల్లి
దేశంలోని 14 రాష్ట్రాల్లో విస్తరించి పీసీసీ, సీపీఐఎంఎల్,  ప్రజాపంథా, సీపీఐఎంఎల్ రివల్యూషనరి ఇన్సియేటివ్, మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీల విలీనమై సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఏర్పడుతున్న సందర్భంగా 2024 మార్చి 3,4,5 తేదీల్లో  ఖమ్మంలో జరిగే ఐక్యతా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐఎంఎల్ ప్రజా  డిచ్ పల్లి, ఇందల్ వాయి మండలాల కార్యదర్శి మురళి పిలుపునిచ్చారు. సోమవారం ఇందల్ వాయి మండల కేంద్రంలో మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరగబోయే సీపీఐఎంఎల్ మాస్ లైన్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా  అయన మాట్లాడుతూ భారత విప్లవోద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నదన్నారు. మారిన పరిస్థితులను సరిగ్గా అంచనా వేసుకోలేకపోయిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశ పెట్టుబడిదారీ విధానం విసిరే సవాళ్లను అధిగమించడానికి కమ్యూనిస్టు విప్లవోద్యమం సైతం మార్పులు చేసుకోవాల్సి ఉందన్నారు. ఆకృషి కొనసాగింపే మూడు పార్టీల ఐక్యత అని అన్నారు.  దేశంలో బలమైన విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఈ ఐక్యత సభ ఒక ముందడుగుగా అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పంథా  నాయకులు  గంట రాజేందర్, మోహన్, రాందాస్, సాయిబాబా, సుమన్, గంగాధర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love