నవతెలంగాణ- ఖమ్మం రూరల్:
మండలంలోని కాచిరాజు గూడెం పాఠశాలో శుక్రవారం నిర్వహించిన గతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్న ఆవరణలో ప్రధానోపాధ్యాయుల సమక్షంలో జెండాను ఎగురవేశారు. ఇదే సమయంలో జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం ప్రారంభించారు. జాతీయ గీతాలాపన ప్రారంభించిన సమయంలో కొందరు పైకి చూసి విషయాన్ని గు ర్తించారు. దీంతో నాలుకర్చుకునన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే వ్యక్తి జాతీయ జెండాకు అవమానం కల్గిస్తే సామాన్యులు పరిస్థితేమిటోనని పలువురు చర్చించుకున్నారు.