– పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 15న జరుపుకునే స్వతంత్ర దినోత్సవ పంద్రాగస్టు కోసం రూ.25లకే జాతీయ జెండా మద్నూర్ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్నట్లు పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంటల్ అధికారులు తెలిపారు. మండల ప్రజలు పంద్రాగస్టు కోసం జాతీయ జెండా కొనుగోళ్ళను రూ.25లకే పోస్ట్ ఆఫీస్ లో కొనుగోలు చేసుకుని సద్వినియోగం పంచుకోవాలని పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అధికారులు కోరారు.