నవతెలంగాణ-బెజ్జంకి
ఇంటింటా జాతీయ జెండాలను పంపిణీ చేసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలనే గోప్ప సంకల్పంతో ప్రభుత్వం జాతీయ జెండాలను ఇంటింటా పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదివారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగ వ్యవహరిస్తూ జాతీయ జెండాను అగౌరవపరిచేల ఎక్కడ పడితే అక్కడే భధ్రపరచడం శోచనీయం.ఎందరో స్వాతంత్ర్య సమరయోదుల పోరాట పలితమే స్వాతంత్ర్య భారత దేశమని ప్రజాప్రతినిధులు చెబుతూనే జాతీయ జెండాలను అగౌరపరచడమేంటని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.సంబధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి జాతీయ జెండా గౌరవాన్ని కాపాడాలని పలువురు సూచిస్తున్నారు.