బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు ఆలె భాస్కర్ రాజ్..

నవ తెలంగాణ – చండూరు
కలకత్తా హైకోర్టు 2010 నుండి బెంగాల్ ప్రభుత్వం ముస్లింలకు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు తీర్పు స్వాగతించదగినిదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ నాయకులు ఆలె భాస్కర్ రాజ్ తెలిపారు. శనివారం చండూరు, మునుగోడు ప్రాంతాల్లో పట్టభద్రుల ఏమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్లలో అక్రమంగా ముస్లింలను జొప్పించి, వారిని ఓబీసీలుగా చిత్రీకరించి, ఓబీసీల రిజర్వేషన్లను దోచి ముస్లింలకు ఓబీసీ సర్టిఫికెట్లను కట్టబెట్టి తీరని అన్యాయం చేస్తున్న నేటి బీజేపీ యేతర ప్రభుత్వాలకు చెంపపెట్టుగా, ఉందన్నారు. ఎన్డీయే యేతర పక్షాలు చేస్తున్న ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలను హిందువులు గమనిస్తున్నారని, హిందూ సమాజం కూడా చైతన్యవంతం అవుతుందని, ఓట్ల ద్వారా బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై మమతా బెనర్జీ సుప్రీంకోర్టు వెళ్తా అనడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, జిల్లా అధికార ప్రతినిధి నకిరేకంటి లింగస్వామి, జిల్లా కార్యదర్శి బొడిగే అశోక్, మండల అధ్యక్షులు పెంబళ్ల జానయ్య, మున్సిపల్ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా కోశాధికారి బోడ ఆంజనేయులు, జిల్లా నాయకులు మాదగోని నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love