వురిమళ్ళ ఫౌండేషన్ – అక్షరాల తోవ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు నిర్వహించనున్నారు. ‘వురిమళ్ల శ్రీరాములు’ స్మారక కథల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5000/-, రూ.4000/-, రూ.3000/- లతో పాటు రెండు కన్సలేషన్ బహుమతులు రూ.1000 చొప్పున ఇవ్వనున్నారు. ‘వురిమళ్ళ పద్మజ’ స్మారక కవితల పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.4000/-, రూ.3000/-, రూ.2000/- లతో పాటు రెండు కన్సలేషన్ బహుమతులు రూ.1000 చొప్పున అందివ్వనున్నారు. వీరితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాహిత్యంలో విశేష కృషి చేసిన ఒకరికి ‘భోగోజు పురుషోత్తం సముద్రమ్మ’ సాహితీ పురస్కారం కూడా అందివ్వనున్నారు. ఆసక్తి కలిగిన వారు కథలు, కవితలు 15 ఏప్రిల్ లోగా భోగోజు ఉపేందర్‌రావు, ఇ.నెం. 11-10-694/5, బురహాన్ పురం, ఖమ్మం – 507001 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9494773969 నంబరు నందు సంప్రదించవచ్చు.