జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ చాంప్‌ తెలంగాణ

జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ చాంప్‌ తెలంగాణహైదరాబాద్‌: జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను తెలంగాణ జట్టు కైవసం చేసుకుంది. తెలంగాణ జట్టు 772 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఓవరాల్‌ చాంపియన్‌గా నిలువగా, కేరళ జట్టు 494 పాయింట్లతో రన్నరప్‌ టైటిల్‌ సాధించింది. తెలంగాణ క్రీడాకారులు 105 స్వర్ణాలు, 85 రజతాలు, 92 కాంస్య పతకాలు సాధించడం విశేషం. గచ్చిబౌలి అథ్లెటిక్స్‌ స్టేడియంలో నాలుగు రోజుల పాటు ఉత్సాహంగా జరిగిన ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. దేశవ్యాప్తంగా ఐదు వేల మంది మాస్టర్‌ అథ్లెట్లు పోటీపడిన ఈవెంట్‌ను విజయవంతంగా నిర్వహించడానికి కషి చేసిన జాతీయ, రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులకు ఆ సంఘం నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మర్రి లక్ష్మణ్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాస్టర్‌ అథ్లెటిక్స్‌ సంఘం కార్యదర్శి ప్రభు, కోశాధికారి డి.లక్ష్మి, సహాయ కార్యదర్శి లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love